Bull: మూడు ఫ్లోర్లు ఎక్కి.. బెడ్ పై పడుకున్న ఎద్దు
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది ఓ ఎద్దు ఇంట్లోకి వచ్చి ఏకంగా మూడు ఫ్లోర్లు ఎక్కి అలసిపోయి బెడ్ రూమ్ లో బెడ్ పై ఎంచక్కా సేద తీరింది. ఇంట్లోకి వచ్చిన ఎద్దును గమనించి ఇంట్లోని వారు భయపడ్డారు.

Bull
Bull: సాధుజంతువులు ఇంట్లోకి రావడం సాధారణ విషయమే. కుక్కలు, పిల్లలు అయితే మన కాళ్ళ మధ్య తిరుగుతుంటాయి. మనం ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఎన్ని ఫ్లోర్లు అయిన అలవోకగా ఎక్కగలకు. అదే ఎద్దు (వృషభం)లాంటి బారి జంతువు ఇంట్లోకి వస్తే.. అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్ కి వెళ్తే?.. ఇంకేముంది ఇంట్లో వారు హడలిపోతారు.
ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఓ ఎద్దు ఇంట్లోకి వచ్చి ఏకంగా మూడు ఫ్లోర్లు ఎక్కి అలసిపోయి బెడ్ రూమ్ లో బెడ్ పై ఎంచక్కా సేద తీరింది. ఇంట్లోకి వచ్చిన ఎద్దును గమనించి ఇంట్లోని వారు భయపడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలోని ఓ ఇంట్లో జరిగింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఓ వృషభం ఇంట్లోకి వచ్చింది. కానీ దాన్ని ముందు ఎవరు గమనించలేదు. ఇరుకైన మెట్లమీద నుంచి మూడో ఫ్లోర్ కి చేరుకుంది వృషభం.. ఆ ఫ్లోర్ లో ఉన్న బెడ్ రూమ్ లో బెడ్ పై హాయిగా పడుకుంది.
అక్కడ ఉన్న అద్దంలో చూస్తూ నెమరు వేసుకుంటూ కాసేపు కునుకు తీసింది. కొద్దీ సేపటి తర్వాత దానిని గమనించిన ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దించారు. ఇక ఇప్పుడు ఆ వృషభానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.