కాగడాలు విసరడమే ఆట : ఆలయంలో ‘అగ్ని కేళి’ ఉత్సవాలు
కాగడాలను ఒకరిపై మరొకరు విసురుకోవడం ఇక్కడ ఆనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.

కాగడాలను ఒకరిపై మరొకరు విసురుకోవడం ఇక్కడ ఆనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.
కాగడాలను ఒకరిపై మరొకరు విసురుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఆటకు ‘అగ్ని కేళి’ అని పేరు. కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఈ ‘అగ్నికేళి’ ఆట ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఎనిమిది రోజుల పాటు ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా భక్తులంతా ఉత్సాహంగా ఆటలో పాల్గొంటారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు కాగడాలను విసురుకుంటారు. అత్తూరు, కొడత్తూరు గ్రామాలకు సమీపంలోని వారికి మాత్రమే ఈ ఆటలో పాల్గొనేందుకు ప్రవేశం కల్పిస్తారు.
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వర్డ్ మాకు తెలుసు
ఈ గ్రామాల్లోని భక్తులంతా ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. చివరి ఎనిమిదో రోజున వీరంతా రెండు వర్గాలుగా విడిపోతారు. ఆ తర్వాత మండుతున్న పొడవాటి కొబ్బరి మట్టలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటూ ఉత్సాహంగా ఆటలో పాల్గొంటారు. ఇందులో ఒక్కో భక్తుడు 5 సార్లు మాత్రమే మండుతున్న కొబ్బరి కట్టలను మరొకరిపై విసరాలన్నది ఇక్కడి నిబంధనగా చెబుతుంటారు. ఈ ఆటలో ఎవరికైనా గాయాలైతే వారికి అమ్మవారికి అర్చన చేసిన కుంకుమతో చికిత్స చేస్తారని ఆలయ అర్చకుడు తెలిపారు.
కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం కాంప్లెక్స్ మంగళూరుకు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి 360 మైళ్ల దూరంలో ఉంది. నందిని నది ఒడ్డున ఈ దుర్గా దేవాలయాన్ని నిర్మించారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో అగ్నికేళి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ అగ్నికేళి ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH Visuals of the ‘Agni Kheli’ or Thoothedhara ritual from Sri Durgaparameshwari temple in Kateel, Karnataka. pic.twitter.com/xCqF6lrBGQ
— ANI (@ANI) April 22, 2019