petrol, Lemons free : మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ

మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంటూ ప్రకటించాడో ఓ షాపు యజమాని.

petrol, Lemons free : మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ

Petrol, lemons free In This Shop

Updated On : April 21, 2022 / 3:05 PM IST

petrol, Lemons free in this shop : ఈ సీజన్ ఈ సీజన్ అనేది లేకుండా పెట్రోల్ రేట్ ఆకాశాన్ని అంటుతోంది. అలాగే వేసవి సీజన్ లో ఎక్కువగా ఉపయోగపడే నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంతగా అంటే ఒక్కో నిమ్మకాయి యాపిల్ ధరలో ఉన్నాయి. ఒక్క నిమ్మకాయి రూ.10లు అమ్ముతోంది. అటు పెట్రోలు ధరలు, నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని అంటే వేళ ఓ మొబైల్ షాపు యజమాని ఓ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. అదేమంటే మొబైల్ కొంటే పెట్రోలు, నిమ్మకాలు ఫ్రీ అంటూ ప్రకటించాడు.

రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్ కొంటే లీటరు పెట్రోలు ఫ్రీ అంటూ బోర్డు పెట్టి మరీ ప్రకటించాడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో ఓ మొబైల్ దుకాణదారుడు. దేశంలో పెట్రోలు, నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో వార‌ణాసిలోని మొబైల్ షాపు యజమాని వాటినే ఆఫ‌ర్లుగా ప్ర‌క‌టించాడు. దీంతో ఆయ‌న దుకాణానికి కష్టమర్ల ఎగబడుతున్నారట.వారణాసిలోని మొబి వరల్డ్‌ షాప్ దుకాణదారుడు చేసిన ఈ ప్ర‌కటనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

వేసవి ప్ర‌త్యేక ఆఫర్లుగా అత‌డు త‌న స్టోర్‌లో రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు చొప్పున‌ ఉచితంగా ఇస్తాన‌ని పేర్కొన్నాడు. అలాగే, మొబైల్‌ ఫోన్‌ యాక్సెసరీస్‌పై 5 నిమ్మకాయలు ఇస్తాన‌ని బోర్డులు పెట్టాడు.