97 నియోజకవర్గాల్లో ప్రచారం సమాప్తం : ఏప్రిల్ 18న పోలింగ్

లోక్‌సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 01:38 PM IST
97 నియోజకవర్గాల్లో ప్రచారం సమాప్తం : ఏప్రిల్ 18న పోలింగ్

Updated On : April 16, 2019 / 1:38 PM IST

లోక్‌సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.

లోక్‌సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. 97 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సాఫీగా సాగేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత పెంచడంతో పాటు..EVMలు మొరాయించకుండా చర్యలు చేపట్టింది. మొత్తం 12 రాష్ట్రాలలో 97 నియోజకవర్గాలలో ఏప్రిల్ 18వ తేదీ గురువారం పోలింగ్ జరగనుంది.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

పుదుచ్చెరి, త్రిపుర, మణిపూర్‌‌లో ఒక్కొక్క స్థానం, జమ్ము కాశ్మీర్‌లోని 2 స్థానాలు, వెస్ట్ బెంగాల్, చత్తీస్‌గఢ్‌లో మూడు నియోజకవర్గాలు, అస్సోం, ఒడిశా, బీహార్‌ రాష్ట్రాల్లో 5 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 10, కర్నాటకలోని 14, తమిళనాడులోని 39 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ప్రచారానికి లాస్ట్ డే కావడంతో నేతలంతా ఉధృతంగా ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హెలిప్యాడ్‌లో ప్రచారానికి వెళుతుండగా ఈసీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ తనిఖీలు చేయడం కలకలం రేపింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో పలు ర్యాలీలకు హాజరై ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 115 నియోజకవర్గాలపై నేతలు ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇక్కడ ఏప్రిల్ 23న మూడో విడత పోలింగ్ జరుగనుంది. 
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి