మోడీని నమ్మలేం : జవాన్ కుటుంబ సభ్యులు

ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని నమ్మలేమని పుల్వామా ఉగ్రదాడిలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published By: chvmurthy ,Published On : February 16, 2019 / 10:03 AM IST
మోడీని నమ్మలేం : జవాన్ కుటుంబ సభ్యులు

ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని నమ్మలేమని పుల్వామా ఉగ్రదాడిలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వాన్ని నమ్మలేమని పుల్వామా ఉగ్రదాడిలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు కొత్తేమి కాదని, గతంలో చాలాసార్లు ఉగ్రదాడులు జరిగాయన్నారు. భద్రతా దళాలకు సంపూర్ణ స్వేఛ్చ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలోనే భద్రతా దళాలకు సంపూర్ణ స్వేఛ్చఇచ్చి ఉంటే ఈరోజు మారణ హోమం జరిగి ఉండేది కాదని వాపోయారు. 

తన సోదరుడి ప్రాణం కంటే ప్రభుత్వం అందించే నష్టపరిహారం విలువైనది కాదని ప్రదీప్ సోదరుడు అన్నాడు. జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎప్పుడూ గౌరవించలేదని ప్రదీప్ తండ్రి మండి పడ్డాడు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, ఉగ్రవాదుల దాడులు ఆగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Read Also :  పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్
Read Also :  ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా