Punjab Politics : అమిత్ షాతో సమావేశమైన అమరీందర్ సింగ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు.

Punjab Politics : అమిత్ షాతో సమావేశమైన అమరీందర్ సింగ్

Amarender (2)

Updated On : September 29, 2021 / 6:38 PM IST

Punjab Politics ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు. అమరీందర్ బీజేపీలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో అమిత్ షా తో కెప్టెన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ALSO READ పంజాబ్ పీసీసీ చీఫ్ గా లాల్ సింగ్!

అయితే సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన సమయంలోనే కాంగ్రెస్​పై అమరీందర్​ బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో చేరడంపై అమరీందర్​ను మీడియా ఇటీవలే ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ఆయన కొట్టిపారేయకపోగా.. నా మద్దతుదారులతో చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటా అని తనకున్న ఆప్షన్లను బయటపెట్టారు.

అమరీందర్​ పార్టీ మారితే వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ సీఎం పార్టీని వీడుతున్నారంటే అధికార పక్షానికి కొంత ఇబ్బంది కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.