ఎక్కడైనా చూశారా : రెండు తలల పిల్లి

  • Published By: madhu ,Published On : November 17, 2019 / 09:12 AM IST
ఎక్కడైనా చూశారా : రెండు తలల పిల్లి

Updated On : November 17, 2019 / 9:12 AM IST

రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? రెండు తలలు ఎందుకుంటాయి ? అంటారు. కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్‌ రాల్ఫ్‌ ట్రాన్‌కు  చెందిన క్లినిక్‌లో…  ఒక పిల్లి నాలుగు నెలల క్రితం పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే భిన్నంగా రెండు ముఖాలతో జన్మించింది.

దీంతో ఆ పిల్లిని దానితల్లి  దగ్గరికి కూడా రానివ్వలేదు. డాక్టర్‌ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి డుయో అని పేరు కూడా పెట్టాడు. అయితే  పిల్లికూన పుట్టుకతోనే వచ్చే లోపంతో శరీర అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నా ముఖాలు మాత్రం రెండుగా ఉన్నాయి.  అయితే ముక్కు, నోరు మాత్రం యథావిధిగా పని చేస్తున్నట్లు తెలిపారు.

మొదట్లో డుయో సన్నగా ఉండి, తిండి కూడా తినడానికి ఇబ్బంది పడేదు.  ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడినట్టు డాక్టర్  రాల్ప్ చెబుతున్నారు. డుయోకు రెండు తలలు, రెండు నోర్లు ఉండటంతో.. రెండు నోళ్ల నుంచి రెండు సార్లు మియావ్ అంటూ పిలుస్తోంది. ఈ పిలుపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే రాల్ఫ్ డుయో టూ ఫేస్డ్ క్యాట్ అంటూ ఓ ఫేస్‌బుక్ పేజీని సైతం ఓపెన్ చేశారు. నిత్యం డుయోకు సంబంధించిన పోస్ట్‌లను చేస్తున్నారు.  డుయో తింటున్న, ఇంకో పిల్లితో ఆడుకుంటున్న వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
Read More : అరుదైన దృశ్యం : లాయర్ బిడ్డను ఎత్తుకుని ప్రమాణం చేయించిన జడ్జ్