మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్.. స్టే విధించిన క్యాట్

ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్‌ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) గురువారం స్టే విధించింది. 

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 04:19 AM IST
మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్.. స్టే విధించిన క్యాట్

Updated On : April 26, 2019 / 4:19 AM IST

ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్‌ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) గురువారం స్టే విధించింది. 

ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్‌ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) గురువారం స్టే విధించింది. 

కర్ణాటక కేడర్‌ కు చెందిన మోషిన్ ను ఒడిశాలో ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమించబడ్డాడు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్-16,2019న ఒడిషాలోని సంబాల్‌పూర్‌ కి మోడీ వెళ్లారు. ఆ సమయంలో మోషిన్ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రధాని హెలికాఫ్టర్ ను తనిఖీ చేసింది. అయితే ఇది నిబంధనలుకు విరుద్దమని, ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్లను తనిఖీ చేయకూడదని చెబుతూ ఎన్నికల సంఘం మోషిన్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎస్పీజీ రక్షణ కలిగివాళ్లకు కొన్ని స్థాయిల్లో కొన్ని మినహాయింపులు మాత్రమే ఉంటాయని, బ్లూ బుక్ ప్రకారం ప్రస్థుతం ఎస్పీజీ రక్షణకు సంబంధించిన నిబంధనల్లోకి తాము వెళ్లడం లేదని,కానీ చట్టం నిబంధన తప్పనిసరిగా కాపాడబడాలని క్యాట్ తెలిపింది.
Also Read : వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని