Covid Victim: డాక్టర్ వల్లే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని కొవిడ్ మృతుని కుటుంబీకులు..

కరోనావైరస్ ఫెసిలిటీ సెంటర్ లోని డాక్టర్ ను కొవిడ్ మృతుని కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. గువాహటికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోజాయ్ లో ఈ ఘటన జరిగింది. అత్యంత దారుణంగా గుద్ది...........

Covid Victim: డాక్టర్ వల్లే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని కొవిడ్ మృతుని కుటుంబీకులు..

Horrific Assault

Updated On : June 2, 2021 / 3:26 PM IST

Covid Victim: కరోనావైరస్ ఫెసిలిటీ సెంటర్ లోని డాక్టర్ ను కొవిడ్ మృతుని కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. గువాహటికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోజాయ్ లో ఈ ఘటన జరిగింది. అత్యంత దారుణంగా గుద్ది, కొట్టి, చెత్త క్యాన్ లు విసిరి, ఇటుకరాళ్లతో కొట్టారు. ఆక్సిజన్ కొరత వల్ల కొవిడ్ పేషెంట్ చనిపోగా అది డాక్టర్ వల్లనే జరిగిందని నిందిస్తూ అతనిపై దాడి చేశారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న 24మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సిటీ ఉడాలీ మోడల్ హాస్పిటల్ లో డా. సూయెజ్ కుమార్ సేనాపతి డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

పిపాల్ పుఖూరి గ్రామానికి చెందిన గియాజ్ ఉద్దీన్ అనే వ్యక్తి కొవిడ్ సమస్యలతో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడు.

పేషెంట్ కు సంబంధించిన అటెంటెంట్ నా దగ్గరకు వచ్చి.. ఉదయం నుంచి యూరిన్ కు వెళ్లడం లేదని చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పారు. నేను రూమ్ కు వెళ్లి చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు… అటెంటెంట్‌కు మెసేజ్ ఇచ్చేసరికి బంధువుల్లో ఒకరు తిడుతూనే ఉన్నాడు.

పేషెంట్ చనిపోయాడని తెలిసి ఇంకొక వ్యక్తి హాస్పిటల్ పై దాడి చేయడం మొదలుపెట్టాడు. చాలా మంది మెడికల్ ఆఫీసర్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. డా.సేనాపతి రూంలోకి వెళ్లి తలుపేసుకున్నారు. అది పగలుగొట్టుకుని లోపలికి వెళ్లి డాక్టర్ పై దాడి చేశారు.

వాళ్లు హాస్పిటల్ పై మూకుమ్మడిగా అటాక్ చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తాం. ఓ రూంలోకి వెళ్లి దాక్కుందానుమనుకునేసరికి వాళ్లు అక్కడకు కూడా వచ్చి కొట్టారు. నా గోల్డ్ చైన్, రింగ్, మొబైల్ అన్నీ లాక్కున్నారు’ అని డాక్టర్ చెప్తూ ఓ 30 మంది వరకూ ఇందులో ఉన్నారని వివరించారు.

తీవ్ర గాయాలు కావడంతో నాగోన్ లోని వేరే హాస్పిటల్ కు మార్పించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. జేఏ జయలాల్ ఘటనను ఖండించారు. దీనిపై నిరసనగా డాక్టర్లు ఈ రోజంతా నల్ల బ్యాడ్జ్ లతో నిరసన వ్యక్తం చేయనున్నారు.