పిల్లలూ స్వీట్లు తినొద్దు..! పాఠశాలల్లో ‘సుగర్ బోర్డులు’.. ప్రిన్సిపాళ్లకు సీబీఎస్ఈ కీలక ఆదేశాలు

పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఐఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

పిల్లలూ స్వీట్లు తినొద్దు..! పాఠశాలల్లో ‘సుగర్ బోర్డులు’.. ప్రిన్సిపాళ్లకు సీబీఎస్ఈ కీలక ఆదేశాలు

childrens

Updated On : May 18, 2025 / 10:22 AM IST

CBSE Key Decision: స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొంతమంది అతిగా స్వీట్లు తింటుంటారు. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే స్వీట్లంటే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. కొంతమంది చిన్నారులైతే ఏదైనా స్వీట్ పదార్ధం బ్యాగులో లేనిదే బండి వెళ్లేందుకు మారం చేస్తుంటారు. అయితే, పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఐఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

 

పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించేలా..
డయాబెటెస్ (సుగర్ వ్యాధి) పెద్దవారిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యగా టైప్-2 డయాబెటెస్ అధికశాతం మందిని ఇబ్బంది పెడుతోంది. ఒక్పప్పుడు పెద్దలకే పరిమితమైన టైప్-2 డయాబెటెస్ ఇప్పుడు పిల్లల్లోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రిన్సిపాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధుమేహంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. దీనిపై పాఠశాల స్థాయి నుంచే అప్రమత్తత పాటించేలా చర్యలు తీసుకోనుంది. విద్యార్థులు పరిమితికి మించి స్వీట్లు, చెక్కెర పదార్థాలు తినకుండా, శీతల పానీయాలు తాగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పాఠశాలలకు సూచించింది.

 

పాఠశాలల్లో ‘సుగర్ బోర్డులు’
పాఠశాలల్లో సుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏ తినుబండారంలో చెక్కెర ఎంత శాతం ఉందో రాయలని సూచిస్తూ అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు సీబీఎస్ఈ లేఖలు రాసింది. 4 -10 ఏళ్లలోపు విద్యార్థులు తినే ఆహారంలో 13శాతం చెక్కెర ఉంటోంది. 11-18 ఏళ్ల పిల్లల్లో 15శాతంగా ఉంది. అనుమతించిన పరిమితి కన్నా ఇది ఐదు శాతం అధికం. అందువల్ల ఏ తినుబండారంలో ఎంత చెక్కర ఉందో, అధికంగా తింటే ఎలాంటి ముప్పు ఉంటుందో బోర్డులపై రాయాలని తెలిపింది. ఈ ఆదేశాల అమలుపై జులై 15లోగా సంక్షిప్తంగా నివేదిక, ఫొటోలు పంపాలని సూచించింది.

 

షుగర్ బోర్డులపై నమోదు చేయాల్సినవి..
♦ సిఫార్సు చేయబడిన రోజువారీ చెక్కెర తీసుకోవటం.
♦ సాధారణంగా తీసుకునే ఆహారాలు, పానీయాలలో చెక్కెర శాతం వివరాలు
♦ అధిక చెక్కెర వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
♦ చెక్కెర ఉత్పత్తులకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ పదార్థాలు.
♦  అంతేకాక.. సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించి మంచి ఆహారపు అలవాట్లుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
♦ చెక్కర పదార్థాలను తక్కువగా తీసుకోవటం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు తెలియజేయాలి.