Uttarakhand Elections : ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుశీల్ చంద్ర విడుదల చేశారు.

Uttarakhand Elections : ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి

Uttarakhand Elections

Updated On : January 8, 2022 / 6:11 PM IST

Uttarakhand Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఇక ఉత్తరాఖండ్ ఎన్నికల గురించి ఒకసారి పరిశీలిస్తే.. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు కావాలి. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఐదేళ్లకాలంలో తీవ్ర రాజకీయ అనిశ్చితి ఏర్పడిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. ముగ్గురు సీఎంలు మారారు. 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే త్రివేంద్రసింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన స్థానంలో ఎంపీ అయిన తిరత్ సింగ్ రావత్‌ సీఎం అయ్యారు.

చదవండి : Five States Elections 2022 : మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. ముఖ్య తేదీలు ఇవే

కానీ కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతో ఆరు నెలలలోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోయారు. దీంతో ఆయనస్థానంలో పుష్కర్‌సింగ్ ధామీ బాధ్యతలు స్వీకరించారు. యూపీ లానే ఉత్తరాఖండ్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్‌ తీవ్రస్థాయికి చేరడానికి హరిద్వార్‌లో నిర్వహించిన కుంభమేళానే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

చదవండి : Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా ? ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ

ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 57 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ 11 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ లో ఒకదశలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 21న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవనుండగా.. ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మొత్తం స్థానాలు 70
మ్యాజిక్ ఫిగర్ 36
ప్రస్తుతం అధికారంలో బీజేపీ
ప్రస్తుతం బీజేపీకి 57 సీట్లు
కాంగ్రెస్‌కు 11 స్థానాలు
2 స్థానాల్లో ఇతరుల ప్రాతినిధ్యం