సెంట్రల్ విస్టా : 15 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ప్రధాని నివాసం

సెంట్రల్ విస్టా : 15 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో  ప్రధాని నివాసం

Updated On : December 18, 2020 / 9:43 PM IST

Central Vista: PM residence to have 10 buildings కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సెంట్రల్​ విస్టా పునఃరాభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా చేసిన ప్రతిపాదనల ప్రకారం.. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా 15 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ప్రధాని నివాస సముదాయం ఉండనుంది. ప్రధానమంత్రి కొత్త నివాస సముదాయాల్లో 10 భవనాలు నిర్మించనున్నారు. గరిష్ఠంగా ఒక్కో బిల్డింగ్ నాలుగు అంతస్తులతో 12మీటర్లు ఎత్తు ఉంటుంది. ఒక్కో భవనం 30,351 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుంది.

అదేవిధంగా, ప్రత్యేక భద్రత దళం భవనం 2.50 ఎకరాల స్థలంలో ఉంటుంది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లోనే ఉపరాష్ట్రపతి ఎన్​క్లేవ్​ ఉండనుంది. ఈ మేరకు పర్యావరణ ,అటవీ శాఖ నిపుణుల కమిటీకి సమర్పించిన తాజా ప్రతిపాదనలో కేంద్రప్రజా పనుల విభాగం (CPWD) ఈ వివరాలు వెల్లడించింది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును చేపడుతోన్న CPWD.. ప్రాజెక్టు వ్యయాన్ని సవరించింది. గతంలో అంచనా వేసిన రూ.11,794 కోట్ల నుంచి రూ.13,450 కోట్లకు పెంచింది.

అయితే..సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు నుంచి పీఎంఓ నూతన కార్యాలయాన్ని మినహాయించే ప్రశ్నే లేదని అధికారవర్గాలు తెలిపాయి. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ముందు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఉంచిన కొత్త ప్రతిపాదనలో పీఎంఓ కార్యాలయం మినహాయింపుపై పేర్కొనలేదని తెలిపారు. కాగా,ఇప్పటికే.. కొత్త పార్లమెంట్​ భవన నిర్మాణానికి సీపీడబ్ల్యూడీ చేసిన ప్రతిపాదనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.