Syringes: వ్యాక్సిన్ సిరంజిల కొరత.. ఎగుమతులపై కేంద్రం నిషేధం

సిరంజిల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Syringes: వ్యాక్సిన్ సిరంజిల కొరత.. ఎగుమతులపై కేంద్రం నిషేధం

Syringes

Updated On : October 9, 2021 / 3:59 PM IST

Syringes: సిరంజిల ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి విదేశాలకు ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడు నెలల పాటు కేవలం మూడు కేటగిరీల సిరంజిలపై నిషేధం విధించింది ప్రభుత్వం.

భారతదేశపు చివరి పౌరుడికి వ్యాక్సిన్ వేసేవరకు దృఢమైన నిబద్ధతతో, దేశీయ లభ్యత కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సిరంజిల కొరత రాకుండా సరఫరాను పెంచుతూ.. ఎగుమతిని నిషేధించింది. “అర్హులైన పౌరులందరికీ వ్యాక్సిన్లు వేయడానికి సిరంజిలు కీలకమని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 94 కోట్ల వ్యాక్సిన్లు అందించారు. 100 కోట్ల వ్యాక్సిన్ల సంఖ్యకు త్వరలో చేరువ కాబోతున్నారు.

ఈ సమయంలో వ్యాక్సిన్ల పంపిణీకి ఉపయోగించే సిరంజిలు తగినంతగా లేవని, అందుకోసం భారత ప్రభుత్వం 0.5ml/1ml AD (ఆటో-డిసేబుల్) సిరంజిలు, 0.5ml/1ml/2ml/3ml డిస్పోజబుల్ సిరంజిలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో అవసరమైన సిరంజిలను పెంచడంలో భారతదేశం వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచం మనల్ని ఆశగా చూస్తోందని ఆరోగ్యశాఖ చెబుతోంది.

సిరంజిల్లో లోపాల వల్ల జపాన్‌లో మిలియన్ల మోతాదులో ఫైజర్-బయోటెక్ వృధా అయిందని, యూరోపియన్ యూనియన్ కూడా ఫిజర్స్ వ్యాక్సిన్ పూర్తి మోతాదును ఉపయోగించగల సిరంజిల కోసం చూస్తున్నాయి. దీని దృష్ట్యా, 0.3 నుండి 0.5 మి.లీ వరకు వివిధ రకాల సిరంజిలను భారతీయ కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇవి ఆటో డిసేబుల్, డిస్పోజబుల్ సిరంజిలుగా ఉన్నాయి.

నిపుణుల అంచనాల ప్రకారం, ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి 800 నుంచి 1,000 కోట్ల సిరంజిలు అవసరం. భారతీయ సిరంజిలు, వైద్య పరికరాల కోసం ప్రపంచం సహజంగా ఎదరుచూస్తున్నాయి. కరోనాకు ముందు, భారతదేశం 200 కోట్ల సిరంజిలను ఎగుమతి చేసేది. ఇప్పుడు వాటి అవసరం మరింత ఎక్కువైంది.