CM Bommai: మోదీని సిద్ధరామయ్య హిట్లర్‌తో పోల్చడంపై సీఎం బొమ్మై స్పందన

సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ మండిపడ్డారు. సిద్ధరామయ్య చేసిన చౌకబారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ వ్యక్తిత్వం ఏంటో తెలుసని చెప్పారు. ఆయనపై చేసిన అటువంటి వ్యాఖ్యలతో ఒరిగేది ఏమీ ఉండబోదని అన్నారు.

CM Bommai: మోదీని సిద్ధరామయ్య హిట్లర్‌తో పోల్చడంపై సీఎం బొమ్మై స్పందన

Updated On : January 23, 2023 / 9:48 AM IST

CM Bommai: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నియంత హిట్లర్ తో పోల్చుతూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల నేపథ్యంలో మోదీని రాష్ట్రానికి రానివ్వండి. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ వందసార్లు చెప్పినా.. అది జరగదు. ప్రజలు నమ్మరు. హిట్లర్ విషయంలో ఏం జరిగింది? అతడు కొన్ని రోజులు ఆడంబరంగా తిరిగాడు. అలాగే, ముస్సోలినీ, ఫ్రాన్కో విషయంలో ఏం జరిగింది? మోదీ కూడా కొన్ని రోజుల పాటు అలాగే తిరుగుతారు’’ అని వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ మండిపడ్డారు. సిద్ధరామయ్య చేసిన చౌకబారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ వ్యక్తిత్వం ఏంటో తెలుసని చెప్పారు. ఆయనపై చేసిన అటువంటి వ్యాఖ్యలతో ఒరిగేది ఏమీ ఉండబోదని అన్నారు.

గుజరాత్ ఎన్నికల సమయంలోనూ మోదీపై ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యాఖ్యలు ఎంతగా ఎక్కువ మాట్లాడితే అంత మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలో జరగాల్సి ఉంది.

Metro Train Technical Problem : సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు