శాడిస్ట్ టీచర్: చికెన్ తేవాలి..చెప్పినమాట వినాలి..లేకుంటే ఫెయిల్ చేస్తా..

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 07:42 AM IST
శాడిస్ట్ టీచర్: చికెన్ తేవాలి..చెప్పినమాట వినాలి..లేకుంటే ఫెయిల్ చేస్తా..

Updated On : December 9, 2019 / 7:42 AM IST

ఓ టీచర్ విద్యార్థిలను దారుణంగా వేధిస్తున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలని..లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలికలు స్కూల్ కు రావాలంటే భయపడుతున్నాడు. స్కూల్ కు రాకపోయినా..తాను చెప్పిన మాట వినకపోయినా..పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాలికలు స్కూల్ రాలేక..మానలేక..టీచర్ అసభ్య ప్రవర్తనలు భరించలేకా..ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్ జాష్‌పూర్‌లోని తుమ్లా పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ జరుగుతోంది.  

12 క్లాస్ బాలికలు మాట్లాడుతూ..టీచర్  రాజేష్ భరద్వాజ్ ఫోన్ నంబర్ అడుగుతున్నారనీ..లైంగికంగా వేధిస్తున్నారనీ వాపోతున్నారు. అంతేకాదు  మగపిల్లల్ని చికెన్ తీసుకురావాలని అడుగుతున్నారనీ లేకుండా  పరీక్షలలో పాస్ చేయనని వేధిస్తున్నారని వాపోతున్నారు.

ఈ విషయం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ కుజూర్ కాగ్నిజెన్స్  దృష్టికి రావటంతో రాజేష్ భరద్వాజ్ ను విచారించగా..తాను ఎప్పుడూ ఇలాంటివి ఏమీ అడగలేదనీ చికెన్ తీసుకుని రమ్మని తాను విద్యార్థులను సరదాగా అడిగానని అంటున్నాడు. నాకు అమ్మాయిలపై ఎటువంటి దురుద్ధేశం లేదని బుకాయించాడు. కానీ విద్యార్ధీ..విద్యార్థినులంతా అదే విషయాన్ని చెప్పటంతో టీచర్ రాజేశ్ భరద్వాజ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.