Chhattisgarh: పాఠశాలలకు జూన్ 26 వరకు వేసవి సెలవులను పొడగించిన ఛత్తీస్‭గఢ్ ప్రభుత్వం

ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది

Chhattisgarh: పాఠశాలలకు జూన్ 26 వరకు వేసవి సెలవులను పొడగించిన ఛత్తీస్‭గఢ్ ప్రభుత్వం

Updated On : June 14, 2023 / 4:14 PM IST

Summer Holidays: ఎండ తీవ్రత తగ్గకపోవడంతో పాఠశాలలకు వేసవి సెలవులు పొడగించింది ఛత్తీస్‭గఢ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 26 వరకు సెలవులు ఇస్తున్నట్లు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 15 వరకు మాత్రమే వేసవి సెలవులు ఉండేవి. 16వ తేదీని పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండగా.. వేసవి తాపం, వడగాలులు తగ్గకపోవడంతో.. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్ బాఘేల్ ప్రభుత్వం పేర్కొంది.

Maharashtra Politics: తంటాలు తెచ్చిన ‘మోదీ-షిండే’ పత్రికా ప్రకటన.. బీజేపీని శాంతింపజేసేందుకు శివసేన మరో పత్రికా ప్రకటన

ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. ఇదే కాకుండా రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఇది అంచనా వేసింది.

Manipur Violence: మళ్లీ రణరంగమవుతోన్న మణిపూర్‭.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు, 9 మంది మృతి