తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 12:30 PM IST
తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల

Updated On : December 4, 2019 / 12:30 PM IST

కేంద్రమాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు బయట ఆయన కుమారుడు కార్తీ చిదంబరం,కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని కార్తీ తెలిపారు. INX మీడియా కేసులో ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్ని ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ(డిసెంబర్-4,2019)ఉదయం సుప్రీంకోర్టు చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

చిదంబ‌రాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచార‌ని, ఇది ప్ర‌తీకారంతో చేప‌ట్టిన‌ చ‌ర్య అని,పగతీర్చుకోవడంలో భాగమైన చర్య అని ఇవాళ చిద్దూకి బెయిల్ మంజూరు అయిన అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు రేపు ఉదయం చిదంబరం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థికపరిస్థితులపై ఆయన పార్లమెంట్ వేదికగా తన గొంతును వినిపించనున్నారని సమాచారం.