Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో యుద్ధంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా తోడయ్యిందని, అది మన దేశానికి మరింత ప్రమాదకరమని రాహుల్ అన్నారు.

Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

China, Pak Are Together. If War Happens? Rahul Gandhi

Updated On : December 26, 2022 / 8:49 AM IST

Rahul Gandhi: ఒకవైపు పాకిస్తాన్‭తో చిరకాల వివాదం.. దీనికి తోడు చైనాతో కూడా ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరికలు చేశారు. దేశానికి ఏనాటి నుంచో ఈ రెండు దేశాలతో చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని, అయితే గతంలో అవి విడివిడిగా ఉండేవని ప్రస్తుతం ఆ రెండు దేశాలు ఒక్కటయ్యాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కలిపి మన దేశంపై యుద్ధం చేస్తే పరిస్థితి ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

Pakistan Army: పాక్ ఆర్మీపై ఐఈడీ దాడి.. వరుస పేలుళ్లలో ఆరుగురు సైనికులు మృతి.. 15మందికి గాయాలు

రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్‭లో ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో రాహుల్ మాట్లాడుతూ ‘‘చైనా పాకిస్తాన్ కలిసి పోయాయి. చాలా కాలంగా ఈ రెండు దేశాలు వేరువేరుగా ఉండేవి. ఈ రెండు దేశాలతో మన దేశానికి వివాదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడవి కలిసి పోయాయి. ఒకవేళ ఆ రెండు దేశాలు మనపై యుద్ధానికి వస్తే మన దేశంలో ఏం జరుగుతుందో ఊహించడానికి కష్టంగా ఉంది. మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన ఆర్మీపై నాకు గౌరవం మాత్రమే కాదు, ప్రేమ-ఆప్యాయతలు కూడా ఉన్నాయి. మీరే ఈ దేశాన్ని కాపాడాలి. మీరు లేకుండా ఈ దేశం లేదు’’ అని అన్నారు.

US Winter Storm: మంచు గుప్పిట్లోనే అమెరికా.. 26 మంది మృతి.. రహదారులపై పేరుకుపోయిన మంచు.. ఫొటోలు

కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో యుద్ధంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా తోడయ్యిందని, అది మన దేశానికి మరింత ప్రమాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. 2014 నుంచి ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ వస్తోంది. ఇక వీటికి తోడు దేశంలో వాతావరణం కూడా కలుషితమైంది. మొదట కొన్ని కలహాలు ఉండేవి, తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇది విధ్వేషాల వరకూ వెళ్లింది. వీటికి తోడు మనపై రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. లధాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దు వెంట ఏం జరుగుతుందో తెలియడం లేదు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటికైనా మేల్కొనాలి’’ అని రాహుల్ అన్నారు.