లోక రక్షకుడు క్రీస్తు పుట్టిన రోజు క్రిస్మస్

క్రిస్మస్..క్రైస్తవులకు అతి పెద్ద పండుగ. ప్రజలను పాపాల నుంచి రక్షించటానికి సాక్షాత్తు రక్షకుడే అంటే దేవుడే సాధారణ మనిషిగా భూమిపై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. పాపుల్ని రక్షించటానికి భూమిమీద సామాన్య మనిషిగా జన్మించి రోజు క్రిస్మస్.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్‌ను క్రైస్తవులు జరుపుకుంటారు. క్రస్తుని విశ్వాసంతో ప్రార్థిస్తారు. లోక రక్షకుడిగా అవతరించిన యేసుక్రీస్తు పుట్టుక క్రిస్మస్ పండుగ. క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ వేడుకలను భక్తిభావంతో జరుపుకుంటారు. క్రిస్మస్ వేడుకలను వెలుగులతో చర్చిలను సుందరంగా తీరిదిద్దారు. విద్యుత్ కాంతులతో చర్చిలన్నీ వెలిగిపోతుంటాయి. బెలూన్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీ, బెల్స్ తదితర అలంకరణలతో చర్చిలు, కైస్త్రవుల గృహాలు కళకళలాడిపోతుంటాయి.
క్రిస్మస్ పండుగ పరామార్థం…
క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు (క్రీస్తు), మస్ అంటే ఆరాధన. అభిషిక్తుడిని ఆరాధించడం అనేది క్రిస్మస్ పరమార్థం.
క్రీస్తు పుట్టుక…
క్రీస్తు పుట్టుక సాధారణమైన అంశం కాదు. క్రీస్తు జననానికి 600 సంవత్సరాల ముందే ఆయన పుట్టుక గూర్చి జ్ఞానులు తెలిపారు. క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు ఆవిష్కరించాయి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయి. మరియమ్మకు దైవ దూత దర్శనమిచ్చి ఆమె గర్బమున క్రీస్తు జన్మిస్తాడని చెప్పిన ప్రకారంగా క్రీస్తు జననం జరిగింది.
లోకాధిపతి అయిన క్రీస్తు పశువుల పాకలో జననం ఓ విశేషం…
క్రీస్తు జననం బెత్లెహెం దేశంలోని పశువుల పా కలో జరిగింది. ఆయన జనన సమాచారం తొలుత గొ ర్రె కాపరులకు అందుతుంది. యేసుక్రీస్తును తొలి సా రిగా దర్శించిన వారు గొల్లలుగా బైబిల్ చెబుతుంది.
తూర్పున దర్శనమించ్చిన నక్షత్రం…
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు త మ ఇళ్లపై ’స్టార్’ను ఏర్పాటు చేస్తారు. క్రీస్తు పుట్టుక కు నక్షత్రాన్ని సూచికగా పరిగణిస్తారు. బెత్లెహెం దేశంలో తూర్పున భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు గుర్తిస్తారు. నక్షత్రం పొడసుపడం గ్రహించిన జ్ఞానులు నక్షత్ర వెలుగు ఆధారం గా బాలయేసు జన్మించిన పశువుల పాక వద్దకు చేరుకుంటారు. బాలయేసును ప్రార్థిస్తారు.