Stock Market : బుల్ పరుగులు..స్టాక్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది.

Stock Market : బుల్ పరుగులు..స్టాక్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు

Market2

Updated On : August 31, 2021 / 4:41 PM IST

Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ‎ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ జోరుతో వరుసగా రెండవ రోజు రికార్డు స్థాయికి పెరిగాయి సెన్సెక్స్,నిప్టీ. సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారి 57,000 పాయింట్లను దాటింది.

మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్లు పెరిగి ఆల్ టైం హై అయిన 57,552 వద్ద స్థిరపడింది. ఇక,నిఫ్టీ 201 పాయింట్లు లాభపడి ఆల్ టైం హై అయిన 17,132 వద్ద ముగిసింది. సుమారు 1434 షేర్లు అడ్వాన్స్ అయితే, 1537 షేర్లు క్షీణించాయి, 105 షేర్లు మారలేదు. ‎భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్,ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ మరియు శ్రీ సిమెంట్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. కరోనా కేసులు తగ్గడం సహా దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జోరుగా ట్రేడింగ్ సాగించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్… కేవలం ఆగస్ట్ నెలలోనే 4000 పాయింట్లు లాభపడి చరిత్రలో మొదటిసారి 57,000 పాయింట్లను దాటింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఉదయం సెషన్ సమయానికే ఆల్ టైమ్ గరిష్టం రూ.2,48,34,296 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ ఆగస్ట్ 4వ తేదీన మొదటిసారి 54,000 మార్కును దాటింది. ఆ తర్వాత 9 సెషన్‌లలోనే అంటే ఆగస్ట్ 13వ తేదీన 55,000 మార్కును చేరింది. తర్వాత వారం రోజుల్లోపే 56,000 మార్కును దాటిన సెన్సెక్స్ ఇవాళ (ఆగస్ట్ 31) 57,000 మార్కు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.