ఢిల్లీ కాలుష్యం :  సీఎం కేజ్రీవాల్ విద్యార్థులకు మాస్క్ లు పంపిణీ 

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 06:51 AM IST
ఢిల్లీ కాలుష్యం :  సీఎం కేజ్రీవాల్ విద్యార్థులకు మాస్క్ లు పంపిణీ 

Updated On : November 1, 2019 / 6:51 AM IST

ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను తగులబెట్టటం వల్ల ఢిల్లీవాసులు కాలుష్య సమస్యలతో తల్లడిల్లుతున్నారనీ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, హర్యానా సీఎం  మనోహర్ లాల్ ఖత్తర్ లకు విద్యార్థులంతా లేఖలు రాయాలని ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 
దయచేసి మా ఆరోగ్యం గురించి ఆలోచించండి అంటూ లేఖలు రాయాలని విద్యార్థులకు సూచించారు. 

రైతులు పంటల వ్యర్థాలను దగ్థం చేయటంతో అక్కడ నుంచి వ్యాపించిన పొగ ఢిల్లీని కమ్మేస్తోందని. దీంతో ఢిల్లీ ‘గ్యాస్ చాంబర్’గా మారిందని అన్నారు. ఈ విషపూరిత గాలిం నుంచి మనల్ని మనం రక్షించోవాలని..అందుకే విద్యార్థులకు మాస్కులను పంపిణీని తమ ప్రభుత్వం చేస్తోందని..ఢిల్లీ ప్రజలంతా కాలుష్యం బారిన పడకుండా మాస్కులను ధరించాలని ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ సూచించారు.  

కాగాసీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్ విద్యార్థులకు  N‌95 మాస్కులను పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్‌లో రెండు మాస్కులు ఉంటాయి.