మహా క్లైమాక్స్ : రోటేషన్ పద్ధతుల్లో ముఖ్యమంత్రుల పాలన 

  • Published By: madhu ,Published On : November 21, 2019 / 04:37 AM IST
మహా క్లైమాక్స్ : రోటేషన్ పద్ధతుల్లో ముఖ్యమంత్రుల పాలన 

Updated On : November 21, 2019 / 4:37 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియా ఆదేశాలు అందినట్లు అందుతోంది. ఇక ఇప్పటికే ఎన్సీపీ కూడా శివసేనకు మద్ధతు పలకడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియరైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 2019, నవంబర్ 21వ తేదీ గురువారం మరోసారి కాంగ్రెస్, ఎన్సీపీలు భేటీ కానున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై రోడ్ మ్యాప్, కామన్ మినిమం పోగ్రాం రూపకల్పన బాధ్యతను జైరాం రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. 

మహారాష్ట్రలో రొటేషన్ పద్ధతిలో మఖ్యమంత్రుల పాలన కొనసాగే అవకాశం ఉంది. మొదట రెండున్నర ఏళ్లు శివసేన, తర్వాత రెండున్నర సంవత్సరాలూ ఎన్సీపీలు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోనున్నాయి. డిప్యూటీ సీఎం పీఠంపై కాంగ్రెస్ ఐదేళ్లు కొనసాగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మహా హైడ్రామాకు తెరపడవచ్చు.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు. 

ఒకవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న శివసేనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి సర్కారు ఏర్పాటును 17మంది శివసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే చర్చలు కొలిక్కి వస్తున్న సమయంలో 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం శివసేనకు తలనొప్పిగా మారింది. మరోవైపు శివసేన అసంతృప్తి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

ఇదిలా ఉంటే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ప్రధాని మోడీని కలవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివసేనతో విసిగిపోయిన బీజేపీ ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందంటూ ప్రచారం జరిగింది. పైగా పవార్‌పై మోడీ ప్రశంసలు కురిపించిన తర్వాత ఈ భేటీ జరగడంతో రెండు పార్టీల దోస్తీపై పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. అయితే తమ మధ్య రాజకీయ చర్చలు జరగలేదని, రైతాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికే కలిసినట్లు పవర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. 
Read More : కోల్ కతాలో నోట్ల వర్షం