ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువయ్యాయా: ట్రాఫిక్ రూల్స్‌పై మంత్రి

ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువయ్యాయా: ట్రాఫిక్ రూల్స్‌పై మంత్రి

Updated On : September 8, 2019 / 5:06 AM IST

కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై స్పందించారు. భారీ జరిమానాలన్నీ ప్రజా సంక్షేమం కోసమేనని వెల్లడించారు. కొత్త మోటారు వాహనాల చట్టం ప్రజలు అనుసరించాలి లేదంటే భారీ ఫైన్‌లు తప్పవని మరోసారి గుర్తు చేశారు. 

‘జీవితం కంటే డబ్బులు ముఖ్యమా.. చట్టం పాటించడానికి ప్రజల్లో ఇంత భయం వేస్తుందా.. దీనిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే 30శాతం ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశాం. ప్రజలు రూల్స్ పాటించడానికి ఎందుకంత కష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా రవాణాశాఖలో మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ రోడ్ యాక్సిడెంట్‌లు తగ్గేలా చేస్తాయని భావిస్తున్నాం’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు. 

‘చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది కేవలం ప్రజలను కాపాడేందుకే. ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యం’ అని గడ్కరీ తెలిపారు. కొత్త మోటారు వాహనాల చట్టం దేశంలో సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.