Barcodes on Medicines: నకిలీ మందులకు చెక్.. మెడిసిన్స్‌పై క్యూఆర్ కోడ్ ఉండేలా త్వరలో కొత్త చట్టం

దేశంలో చెలామణి అవుతున్న నకిలీ మందులకు ఇకపై చెక్ పడబోతుంది. త్వరలోనే దీన్ని అడ్డుకునే విధంగా క్యూఆర్ కోడ్ లేదా బార్‌కోడ్ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది. మందులపై ముద్రించిన కోడ్స్ ద్వారా అవి ఒరిజినలో.. కాదో తెలుసుకోవచ్చు.

Barcodes on Medicines: నకిలీ మందులకు చెక్.. మెడిసిన్స్‌పై క్యూఆర్ కోడ్ ఉండేలా త్వరలో కొత్త చట్టం

Updated On : September 30, 2022 / 5:39 PM IST

Barcodes on Medicines: దేశంలో నకిలీ మందులకు ఇకపై అడ్డుకట్ట పడబోతోంది. మెడిసిన్స్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఉండేలా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ కోడ్ ఆధారంగా ఆ మెడిసిన్ ఒరిజినలా.. లేదా నకిలీదా అని సులభంగా గుర్తించవచ్చు.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

దీని ద్వారా నకిలీ మందుల చెలామణి ఆగిపోతుంది. దీనికి సంబంధించి త్వరలో కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకురానుంది. అంటే వివిధ రకాల ఔషధాలు తయారు చేసే కంపెనీలు ఇకపై ఆ మందులపై క్యూ ఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలి. అలాగని అన్ని మెడిసిన్స్‌పై కోడ్ ఉండక్కర్లేదు. కేంద్రం గుర్తించిన కొన్ని అత్యవసరమైన 300 మెడిసిన్స్‌ విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తిస్తుంది. ఎక్కువగా వాడే, ఖరీదైన, నకిలీ మందులకు అవకాశం ఉన్న ఔషధాలు ఈ జాబితాలో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 35 శాతం మందులు నకిలీవేనట. వీటిలో కొన్ని విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఈ అంశంపై అమెరికా కూడా ఒక నివేదిక తయారు చేసింది. దీని ప్రకారం.. దేశంలో అనేక రకాల మందులు నకిలీవి తయారవుతున్నాయి.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

అందుకే వీటిని అరికట్టాలంటే క్యూ ఆర్ కోడ్ టెక్నాలజీ అవసరం అని అమెరికా 2019లో సూచించింది. అప్పట్నుంచి ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. గత జూన్‌లోనే వివిధ ఔషధ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కోడ్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ కోడ్ ద్వారా ఔషధం పేరు, ఫార్ములా, కంపెనీ, ఎక్స్‌పైరీ, మ్యానుఫాక్చరింగ్ డేట్ వంటి విషయాలు తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి వినియోగదారులు ఈ విషయాలు తెలుసుకోవచ్చు. మొదటి దశలో కీలకమైన ఔషధాల్ని మాత్రమే ఈ పద్ధతిలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత అన్ని ఔషధాలకు వర్తింపజేస్తారు.