LPG Gas Price : కొత్త సంవత్సరం వేళ బిగ్‌షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు.. కొత్త రేట్లు ఇవే..

LPG Gas Price : కొత్త సంవత్సరం వేళ చిరు వ్యాపారులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి.

LPG Gas Price : కొత్త సంవత్సరం వేళ బిగ్‌షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు.. కొత్త రేట్లు ఇవే..

LPG Gas Price

Updated On : January 1, 2026 / 9:40 AM IST
  • న్యూఇయర్ వేళ చిరు వ్యాపారులకు బిగ్‌షాక్
  • గ్యాస్ ధరలను సవరించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు
  • భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

LPG Gas Price : చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో న్యూఇయర్ వేళ బిగ్ షాకిచ్చాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి.

Also Read : Telangana : తెలంగాణలో మరో కొత్త జిల్లా.. నూతన జిల్లా ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు..

జనవరి 1వ తేదీన విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం.. 19కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.111 భారం పడింది. పండుగ వేళ చిరు వ్యాపారస్తులకు ఈ నిర్ణయం గట్టి షాకిచ్చిందని చెప్పొచ్చు.

పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు రూ.1580.50 ఉన్న 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1691.50కు చేరింది. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరిగింది. దీంతో ప్రస్తుతం 19కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1801.50 నుంచి ఒక్కసారిగా రూ.1912.50కి చేరింది. అదేవిధంగా ఆర్థిక రాజధాని ముంబైలో రూ.1642.50, చెన్నైలో రూ.1849.50కు ఎగబాకింది.

మరోవైపు.. పేద వర్గాల ప్రజలకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. గృహ వినియోగ (14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్) గ్యాస్ సలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగానే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. ఇప్పుడు జనవరి నెలకు సంబంధించి రేట్లను ప్రకటించాయి. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.