Telangana : తెలంగాణలో మరో కొత్త జిల్లా.. నూతన జిల్లా ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు..
Telangana : తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను విభజించి.. రంగారెడ్డి అర్బన్ జిల్లా, రంగారెడ్డి రూరల్ జిల్లాగా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.
Telangana
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
- రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు
- గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజనకు చర్యలు చేపట్టిన సర్కార్
- రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాలుగా విభజించేందుకు నిర్ణయం
Telangana : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది. రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండడంతో అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read : కొత్త ఏడాదిలో ఆశావహుల ఆశలు నెరవేరేనా? ఆ పదవుల కోసం కాంగ్రెస్ లీడర్లు వెయిటింగ్ ఇక్కడ
ఇటీవల హైదరాబాద్ మహానగర పాలక సంస్థను తెలంగాణ సర్కార్ పునర్విభజించిన విషయం తెలిసిందే. గతంలో మూడు జిల్లాలు, మూడు పోలీస్ కమిషనరేట్లు ఉండగా.. పునర్విభజన ప్రక్రియలో భాగంగా నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లుగా మార్పులు చేసింది. వీటికి సరిహద్దులు కూడా కేటాయించింది. ఇదేక్రమంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన డ్రాప్ట్ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండడంతో అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు.
షాద్ నగర్, శంషాబాద్ రూరల్ మండలం, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
