మోడీపై యశ్వంత్ సిన్హా సెటైర్లు…”సువర్ణ అధ్యాయానికి” కంగ్రాట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : June 1, 2020 / 02:28 PM IST
మోడీపై యశ్వంత్ సిన్హా సెటైర్లు…”సువర్ణ అధ్యాయానికి” కంగ్రాట్స్

Updated On : June 1, 2020 / 2:28 PM IST

ప్రధాని మోడీపై.. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా వంగ్యాస్రాలు సంధించారు. కరోనా కేసుల్లో నెమ్మదిగా భారత్ టాప్ లోకి వస్తుందని,ఆర్థికవ్యవస్థ కూలిపోతుందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అధ్యయాన్ని తీసుకొస్తున్న మోడీకి శుభాకాంక్షాలు అంటూ వ్యంగ్యంగా యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు. మోడీ బెస్ట్ రీసైకిల్డ్ పీఎం అని సిన్హా సెటైర్ వేశారు.

కోవిడ్-19 కేసుల్లో భారతదేశం అగ్రస్థానానికి చేరుకున్నప్పుడు మరియు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినప్పుడు వచ్చే ఏడాది ఇచ్చే హామీలు ఇంకా బెటర్ గా ఉంటాయని సిన్హా అన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శనివారం(మే-30,2020)ఈ ఏడాది పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను,ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ..జాతినుద్దేశించి ఓ లేఖను మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ లేఖలో మోడీ…గతేడాది ఇరే రోజున భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైన రోజు అని పేర్కొన్న నేపథ్యంలో సిన్హా ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకప్పుడు బీజేపీలో ఓ వెలుగు వెలిగిన యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా మోడీ ప్రభుత్వ ఆర్థిక పాలసీలపై సిన్హా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.