Asaduddin Owaisi: కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు.. ఓవైసీ విమర్శలు

కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.

Asaduddin Owaisi: కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు.. ఓవైసీ విమర్శలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi: అవినీతి విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒకే నాణానికి రెండు ముఖాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సొంత ప్రభుత్వం మీదే మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేయనున్నారు. ఈ సందర్భాన్ని ఊటంకిస్తూ ఓవైసీ పై విధంగా వ్యాఖ్యానించారు.

Mayawati: నేరస్తులకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన బీఎస్పీ చీఫ్ మాయావతి

ఈ విషయమై ఓవైసీ స్పందిస్తూ “కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు. కింది వర్గాలను అణచివేశారు. అందుకే కాంగ్రెస్‌కు చెందిన మాజీ డిప్యూటీ సిఎం తన సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతుంది? అవినీతిని ఎదుర్కోవడంలో ఏ పార్టీ కూడా సీరియస్‌గా లేదని దీన్నిబట్టి తెలుస్తోంది’’ అని ఒవైసీ అన్నారు.

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‭కు మళ్లీ షాకిచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్

కాగా, దీనికి ముందు బిహార్ రాష్ట్రంలో రామనవమి రోజున చెలరేగిన అల్లర్లపై నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. ‘‘అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వెళ్లి కర్జూర తింటున్నారు’’ అని అన్నారు. వాస్తవానికి ఇది ముందస్తు ప్రణాళికలతో జరిగిందని, మరలాంటప్పుడు ప్రభుత్వం నిద్రపోయిందా అని ఓవైసీ ప్రశ్నించారు. మార్చి 31న జరిగినప్పుడైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ ఏప్రిల్ 1న కూడా జరగడం హేయమని ఓవైసీ అన్నారు.