జుమ్లా మేనిఫెస్టో : బీజేపీ ‘సంకల్ప్ పత్ర’పై విపక్షాల విమర్శలు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బీజేపీ సోమవారం (ఏప్రిల్-8,2019) తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప్ పత్ర పేరిట 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది.అయితే బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.బీజేపీ విడుదల చేసిన సంకల్ప్ పత్ర ఓ పెద్ద అబద్దమని కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది సంకల్ప్ పత్ర కాదని జన్స పత్ర(ఓ మోసపూరిత మేనిఫెస్టో)అని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఫెయిల్ అయిన బీజేపీ సర్కార్ విపక్షాలను విమర్శిస్తుందన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఓడించడం ఖాయమని తెలిపారు.ఎంప్లాయిమెంట్,జాబ్స్ గురించి బీజేపీ తమ సంకల్ప్ పత్రలో పొందుపర్చలేదని తెలిపింది.జాబ్స్ గురించి అసలు బీజేపీ మేనిఫెస్టోలో ప్రస్తావనే లేదని సుర్జేవాలా విమర్శించారు.
Read Also : వీవీప్యాట్ స్లిప్పులను లెక్క పెట్టండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నోట్లరద్దుతో ప్రజల సొమ్మును బీజేపీ లూటీ చేసిందని ఆరోపించారు.తాము ఇది చేశాం అని ప్రజలకు చూపించేలేక బీజేపీ రామమందిర్ ప్రస్తావనను మేనిఫెస్టోలో చేర్చిందని కాంగ్రెస్ నాయకుడు మిలింద్ డియోరా అన్నారు.కొన్ని కొత్త అబద్దపు హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.నోట్లరద్దుపై మాట్లాడే దమ్ము మోడీ,అమిత్ షాకు లేదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైందని ప్రశ్నించారు.నాశనమయ్యే పరిస్థితుల్లోకి రైతులు ఎందుకు నెట్టబడ్డారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుని అమలుచేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రస్తావించడంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఫైర్ అయ్యారు.ఇన్నాళ్లు విదేశీ పర్యటనలతో బీజీగా ఉన్న మోడీకి ఇప్పుడు బెంగాల్ లో ప్రజల అవసరాలు గుర్తొచ్చాయా అని ఆమె విమర్శించారు.
Read Also : తోట త్రిమూర్తులకు పవన్ హెచ్చరిక : అన్నయ్య మాటే విన.. మీ మాట వింటానా ?