Congress CWC Meeting : హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం…ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సెప్టెంబరు 16వతేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అధికారికంగా వెల్లడించారు....

Congress CWC Meeting
Congress CWC Meeting : కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సెప్టెంబరు 16వతేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అధికారికంగా వెల్లడించారు. (Congress chief Kharge calls meeting of newly formed CWC) కొత్తగా ఏర్పాటైన సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. (CWC on Sept 16 in Hyderabad) ఇక్కడి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడారు.
IndiGo flight : పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం…భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సెప్టెంబర్ 17న పొడిగించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, ఇందులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌లందరూ పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబరు 17 సాయంత్రం హైదరాబాద్ సమీపంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ హామీలను ప్రకటిస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు.
UP Building Collapses : మూడంతస్తుల భవనం కూలి ఇద్దరి మృతి
ఆగస్టు 20వతేదీన సీడబ్ల్యూసీని ఖర్గే పునర్ నిర్మించారు. యువకులతో పాటు జీ 23 గ్రూప్ నాయకులైన శశి థరూర్, ఆనంద్ శర్మ వంటి 84 మంది సభ్యుల పార్టీ నిర్ణయాధికార సంస్థలో చోటు కల్పించారు.