పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మద్దతు

పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడికి కారణమైన పాక్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రధాని మోడీకి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) ఢిల్లీలో రాహుల్ మాట్లాడుతూ.. సంతాపం, భాధ, గౌరవ సమయమిదని అన్నారు. మన భద్రతా బలగాలకు, భారత ప్రభుత్వానికి తాము పూర్తిగా తమ మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఉగ్రదాడి భయంకరమైన విషాదమని రాహుల్ అన్నారు. మన జవాన్ల కోసం మనందరం కలిసికట్టుగా నిలబడ్డామని తెలిపారు. ఏ శక్తీ కూడా మన దేశాన్ని విభజించడం లేదా విరగ్గొట్టడం చేయలేదని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ..ఇవాళ సంతాపదినమని అన్నారు. 49 మంది ఆర్మీ ఫోర్స్ జవాన్లను మన దేశం కోల్పోయిందని, అమరజవాన్ల కుటుంబాల్లో అండగా ఉంటామన్న ధైర్యాన్ని నింపడం ముఖ్యమైన భాధ్యత అని అన్నారు. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే ఉండదని మన్మోహన్ అన్నారు.
Also Read : చైనా వక్రబుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మహమద్ పై ప్రేమ
Also Read : ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం
Also Read : విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా