Congress Headquarters: బీజేపీ బాటలో కాంగ్రెస్.. ఢిల్లీ కార్యాలయం షిఫ్ట్, పేరు కూడా మార్చేశారు
కాంగ్రెస్ కొత్త కార్యాలయం 6 అంతస్తులు ఉండనుందట. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో కొత్త కార్యాలయం బయట కూడా పీడబ్ల్యూడీ కొంత విధ్వంసం చేసింది

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకు అంటే 2018లో భారతీయ జనతా పార్టీ తన కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రోడ్డుకి మార్చింది. అధునాతన హంగులు, విశాలమైన భవంతిని నిర్మించారు. ఇప్పుడు ఇదే బాటలో కాంగ్రెస్ పార్టీ కూడా పయనించనుంది. జనవరి రెండో వారంలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి మార్చనున్నట్లు సమాచారం. భవనమే కాదు, దానికి పేరు కూడా మార్చారు. దీనిని ఇందిరా భవన్‌గా పిలువనున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ కార్యాలయం ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉంది. ఇది లుటియన్స్ ఢిల్లీలో ఉన్న టైప్ VII బంగ్లాలో ఉంది. దీనిని 1978లో ఇందిరా గాంధీ ప్రారంభించారు. 44 ఏళ్లుగా కాంగ్రెస్ ఒడిదుడుకులకు ఈ కార్యాలయం సాక్షిగా నిలిచింది. ఇక కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని కూడా బీజేపీ కేంద్ర కార్యాయానికి సమీపంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ రోడ్ లోనే నిర్మిస్తున్నారు. అహ్మద్ పటేల్, మోతీలాల్ బోహ్రా పర్యవేక్షణలో కాంగ్రెస్ కొత్త కార్యాలయం నిర్మాణం జరగాల్సింది. అయితే ఆ ఇద్దరు నేతలు కన్నుమూశారు. దీంతో ఈ బాధ్యతలను కేసీ వేణుగోపాల్ కు అప్పగించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కేఏ పాల్ ఛాలెంజ్.. ఆ ముగ్గురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు
కాంగ్రెస్ కొత్త కార్యాలయం 6 అంతస్తులు ఉండనుందట. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో కొత్త కార్యాలయం బయట కూడా పీడబ్ల్యూడీ కొంత విధ్వంసం చేసింది. పెద్దగా నష్టం జరగలేదని పీడబ్ల్యూడీ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి, ఉద్యోగుల కోసం సైడ్ ఎంట్రీ వద్ద మూడు అదనపు మెట్లు నిర్మించారు. వీటికి ఢిల్లీ మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోలేదు.
2018లో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కొత్త భవనానికి మార్చింది. మూడు అంతస్తుల కొత్త కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీంతో లుటియన్స్ జోన్ నుంచి తమ కార్యాలయాన్ని మార్చిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీకి చెందిన ఈ కార్యాలయాన్ని ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో నిర్మించారు. ఈ భవనానికి భూమి పూజ ఆగస్టు 2016లో జరిగింది. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రధాని మోదీ తరచూ ఇక్కడికి వస్తుంటారు. బీజేపీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ తన కార్యాలయాన్ని మార్చుకోనుంది. మల్లికార్జున ఖర్గే హయాంలో ఇది జరగనుంది.
ఇది కూడా చదవండి: 24గంటలు కరెంట్ పచ్చి అబద్ధం.. స్కాముల్లో తిన్నదంతా కక్కిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి