సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 03:49 PM IST
సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్ తన తముకూరు సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్ కు వదిలిపెట్టింది. హాసన్,విజయాపుర,బెంగళూరు నార్త్, ఉడుపి-చిక్కమంగుళూరు,శివమొగ్గ,తుముకూరు,ఉత్తర కన్నడ,మండ్య నియోజకవర్గాల నుంచి జేడీఎస్ బరిలోకి దిగనుంది. మిగిలిన 20 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి దిగనుంది. ఈ సారి హాసన్ నుంచి తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ను బరిలోకి దించబోతున్నట్లు జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రకటించారు. బెంగళూరు నార్త్ లేదా తుముకూరు స్థానాల నుంచి దేవెగౌడ బరిలోకి దిగబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.