Karnataka Cabinet: సిద్ధరామయ్య కేబినెట్‌లో తొలుత ప్రమాణ స్వీకారం చేసే పది మంది మంత్రులు వీరే..
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

DK Sivakumar and Siddaramaiah met the Governor
Karnataka Politics: కర్ణాటక హైడ్రామా ముగిసింది. మూడు రోజులపాటు సాగిన ఉత్కంఠకు తెర దించుతూ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. సీఎం పీఠంపోరులో సిద్ధ రామయ్యకు గట్టిపోటీ ఇచ్చిన డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ విషయమై గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం పోటాపోటీగా తలపడ్డ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఈ పరిణామం అనంతరం తమ ఐక్యతను చాటుకోవడం గమనార్హం. ‘మా చేతులు ఎప్పుడూ కలిసే ఉంటాయి’ అంటూ ఇరు నేతలు ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
Karnataka Politics: కర్ణాటక శాసనసభాపక్ష నేతగా ఎంపికైన సిద్దరామయ్య
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు స్థానిక కంఠీరవ క్రీడా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధ రామయ్య కేబినెట్ లో తొలుత ప్రమాణ స్వీకారం చేయబోయే ఆ పది మంత్రులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 25 నుంచి 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. వీరిలో తొలుత పది మంది ఎమ్మెల్యే ఈనెల 20న సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
Karnataka Congress Victory : విజయవంతమైన కాంగ్రెస్ కర్ణాటక మిషన్..
సిద్ధ రామయ్య సీఎంగా ఎంపికయిన తరువాత.. మంత్రి వర్గం ఎలా ఉండబోతోంది..? ఏయే నేతలను కేబినెట్ లోకి తీసుకుంటారో..? వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశాలపై చర్చ జరుగుతుంది. శివకుమార్‌కు డిప్యూటీతో పాటు ఆయన వర్గంలోని కొందరిని మంత్రులుగా తీసుకొని కీలక శాఖలు అప్పగించేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ప్రమాణ స్వీకారం చేయబోయే పది మంది మంత్రుల్లో శివకుమార్ వర్గానికి చెందిన వారు ఎంత మందికి అవకాశం దక్కుతుంది..? వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
Karnataka Politics: సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఎవరెవరిని పిలుస్తున్నారో తెలుసా?
కులం, ప్రాంతం, సీనియారిటీ ప్రాతిపదికన మంత్రివర్గ విధివిధానాలపై చర్చజరుగుతుందని సమాచారం. మే 19న ఢిల్లీలో పలు దఫాలుగా పరిశీలనల అనంతరం డీకే శివకుమార్, సిద్ధ రామయ్య వర్గాల్లోని తమతమ విధేయులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తొలి జాబితాలో కేబినెట్ మంత్రులుగా పరమేశ్వర, రామలింగారెడ్డి, హెచ్ కె పాటిల్, కేజె జార్జ్, యుటి కాధర్, సతీష్ జార్కిహోళి, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్, హెచ్ సీ మహదేవప్ప, టీబీ జయచంద్రలు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.