Gandhi’s picture: రూ.2వేలు, రూ.5వందల నోట్‌లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలగించండి!

మహాత్మాగాంధీ చిత్రాన్ని రూ.500, రూ .2000 నోట్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Gandhi’s picture: రూ.2వేలు, రూ.5వందల నోట్‌లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలగించండి!

1000 500

Updated On : October 8, 2021 / 6:57 AM IST

Gandhi’s picture: రాజస్థాన్‌లో అవినీతి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మహాత్మాగాంధీ చిత్రాన్ని రూ.500, రూ .2000 నోట్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహాత్మా గాంధీని అవమానించేలా అవినీతికి నోట్లు ఈ నోట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటూ వారు అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్‌లోని అవినీతి కేసుల గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ జనవరి-2019, డిసెంబర్ 31, 2020 మధ్య మొత్తం 616 అవినీతి కేసులు నమోదయ్యాయని, సగటున రోజుకు రెండు అవనీతి కేసులు వెలుగులోకి వస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ సత్యానికి ప్రతిరూపమని, గాంధీ చిత్రాన్ని రూ.500, రూ .2వేల నోట్లపై ముద్రించారని, వీటిని అవినీతి, లంచాలకు ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.

“గాంధీ చిత్రాన్ని చిన్న నోట్లలో మాత్రమే ఉపయోగించాలి”
అక్టోబర్ 2 న గాంధీ 152వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటోని తొలగించి, కేవలం ఆయన కళ్లజోడును మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు.

ఈ సంధర్భంగా సంగోడ్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాట్లాడుతూ.. గాంధీ చిత్రపటాన్ని రూ. 5, రూ. 10, రూ. 50, రూ. 100, రూ.200 నోట్లపై మాత్రమే ఉంచాలని, పేదలు విస్తృతంగా ఉపయోగించే నోట్లు అవి మాత్రమేనని, గాంధీ తన జీవితాంతం నిరుపేదల కోసం పని చేశారని చెప్పుకొచ్చారు.

“గాంధీ కళ్ళజోడు చిత్రాన్ని కానీ, అశోకచక్రాన్ని కానీ, రూ. 500, రూ. 2,000 నోట్లపై ఉపయోగించవచ్చని సూచించారు. గత ఏడున్నర దశాబ్దాలలో దేశవ్యాప్తంగా అవినీతి విస్తరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందన్‌పూర్ తన లేఖలో వెల్లడించారు.