Sanatana Dharma Row: డీఎంకేకు షాక్.. సనాతన ధర్మ వివాదంపై ఉదయనిధిని తప్పుపట్టిన కాంగ్రెస్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏకీభవించడం లేదని పవన్ ఖేరా అన్నారు.

Sanatana Dharma Row: డీఎంకేకు షాక్.. సనాతన ధర్మ వివాదంపై ఉదయనిధిని తప్పుపట్టిన కాంగ్రెస్

Updated On : September 7, 2023 / 5:43 PM IST

Congress on Sanatana Dharma: డీఎంకే పార్టీకి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, అన్ని మతాలను గౌరవించాలని పేర్కొంది. గురువారం ఆ పార్టీ నేత పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై కొడుకు వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్టాలిన్ ప్రకటిన చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే కాంగ్రెస్ లోని కొందరు నేతలు ఉదయనిధి వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండడం గమనార్హం.

Siddaramaiah : ఆలయంలోకి రావాలంటే నన్ను షర్టు విప్పమన్నారు: సీఎం సిద్దరామయ్య

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏకీభవించడం లేదని పవన్ ఖేరా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వివాదాలకు వ్యతిరేకమని, తాము అన్ని మతాలను గౌరవిస్తామని అన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఇండియా కూటమిలోని అన్నా పార్టీలు అన్ని మతాలను గౌరవిస్తాయని అన్నారు. రాజ్యాంగం కూడా ఇలాంటివి అనుమతివ్వదని పవన్ ఖేరా అన్నారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

ఇకపోతే.. ఉదయనిధి వ్యాఖ్యల అనంతరం.. వివాదం సమసిపోతుంది అనుకుంటే మరింత రాజుకుంది. అదే పార్టీకి చెందిన నేత ఏ.రాజా తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్టువ్యాధిలాంటిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి పెద్ద దుమారం లేసింది. అంతకు ముందు ఉదయనిధి స్టాలిన్ ఒక సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, దాన్ని వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా అంతం చేయాలని అన్నారు.