Sonia Gandhi : సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసిన కాంగ్రెస్

సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు.

Sonia Gandhi : సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసిన కాంగ్రెస్

Sonia Gandhi

Updated On : June 17, 2022 / 12:33 PM IST

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుండి విపరీతంగా రక్తస్రావం కావడంతో జూన్ 12న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చేరారు. నిన్న ఉదయం సోనియా గాంధీకి ముక్కుకు సంబంధించి చికిత్స పూర్తి అయింది.

సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు. వైద్యుల పరిశీలనలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతోందని జైరామ్ రమేష్ ప్రకటన విడుదల చేశారు.
Sonia Gandhi: ఆసుప‌త్రిలో చేరిన సోనియా గాంధీ

సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్‌ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. ఇవాళ కూడా హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరముందని.. అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్‌ ఈడీకి విజ్ఞప్తి చేశారు.