ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలి.. రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తాం: జైరాం రమేశ్
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Jairam Ramesh
కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మహాత్మా గాంధీని అవమానించారని, బీఆర్ అంబేద్కర్‌పై మాటల దాడి చేస్తున్నారని చెప్పింది.”రేపు, బెలగావిలో భారత జాతీయ కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని నిర్వహించనుంది. ఇది 2024 డిసెంబర్ 27న జరగాల్సిన ర్యాలీ. అయితే, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో వాయిదా పడింది” అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో తెలిపారు.
బెలగావిలోనే 1924, డిసెంబరు 26న మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయాన్నిఆయన గుర్తుచేశారు. “మహాత్మా గాంధీని అవమానిస్తున్నారు. అంబేద్కర్‌పై దాడి చేస్తున్నారు. భారత రాజ్యాంగం, దాని విలువలు దాడికి గురవుతున్నాయి” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఈ ర్యాలీ తర్వాత జనవరి 27న మోవ్‌లో (డాక్టర్ అంబేద్కర్ జన్మభూమి) లో మరో ర్యాలీ ఉంటుందని తెలిపారు. “2025 జనవరి 14న స్వాతంత్ర్య ఉద్యమంపై చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలి” అని ఆయన అన్నారు.
Polavaram: పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు నిలిపివేత.. ఎందుకంటే..?