‘కరోనా వెళ్లిపో.. నీకిక్కడ పనిలేదు’ భజన కాదు పద్ధతైన పాట

ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్‍కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా కలిసి కరోనా పారిపో.. భారత్‌ను వదిలి వెళ్లిపో అని సంస్కారవంతంగా పాడుతున్న పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది కాబట్టే వైరల్ అయింది.
రాజస్థానీ భాషలో పాడిన పాట.. కరోనా భాగ్ జా(కరోనా వెళ్లిపో).. కరోనా భాగ్ జా భారత్ తారో కైన్ కామ్ రే(భారత్ వదిలి వెళ్లిపో.. ఇక్కడ నీకేం పనిలేదు) అని పాడుతున్నారు. నెటిజన్ల నుంచి ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తుంది.దీనిపై మీరూ ఓ లుక్కేయండి.
ఇండియాలో ఇప్పటిదాకా 44మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది. 5వేల మంది వరకూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని పారామిలిటరీ బలగాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
భారత రైల్వే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 91 హాస్పిటల్స్‌లో 2వేల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 20వేల మంది పేషెంట్లకు సర్వీస్ అందించవచ్చని అంచనా.