తాజ్‌మహల్‌ను మూసేయాలంటూ కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ

తాజ్‌మహల్‌ను మూసేయాలని ఆగ్రా మేయర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజ్ మహల్ తోపాటు ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని లేఖద్వారా కోరారు.
‘‘తాజ్‌మహల్‌ను చూసేందుకు స్వదేశీలతో పాటు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రా నగరానికి వస్తున్నారు..దీంతో ఆగ్రా నగరంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తాజ్‌మహల్‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ మేయరు, నవీన్ జైన్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించారు. వారిలో 708 మందిని హోంఐసోలేషన్ కు తరలించారు. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆగ్రా వైద్యాధికారులు చెప్పారు.
కాగా..చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ 30 దేశాలకు పైగా వ్యాపించింది. ఇటీవల భారత్ లోకూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 32వందలమంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.
See Also | దత్త పుత్రికకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసిన ముస్లిం దంపతులు