ఫరాఖాన్ 12ఏళ్ల కూతురి పెద్ద మనసు, వీధి జంతువుల ఆకలి తీర్చేందుకు చిత్రాలు అమ్మి రూ.70వేలు సేకరణ

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 08:13 AM IST
ఫరాఖాన్ 12ఏళ్ల కూతురి పెద్ద మనసు, వీధి జంతువుల ఆకలి తీర్చేందుకు చిత్రాలు అమ్మి రూ.70వేలు సేకరణ

Updated On : April 13, 2020 / 8:13 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస కూలీలు తిండి లేక పస్తులు ఉంటున్నారు. వారి ఆకలి బాధ తీర్చేందుకు పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, నాయకులు, స్వచ్చంద సేవా సంస్థల వాళ్లు ముందు కొచ్చారు. పెద్ద మనసుతో విరాళాలు సేకరించి సాయం చేస్తున్నారు. కొందరు అన్నదానం చేసి మనుషుల ఆకలి బాధ తీరుస్తున్నారు. కొందరు నిత్యవసరాలు అందజేస్తున్నారు. కష్టకాలంలో మీకు మేమున్నాం అని అండగా నిలిచారు. మనుషుల సంగతి సరే, మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? లాక్ డౌన్ కారణంగా వీధి జంతువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తినడానికి తిండి దొరకడం లేదు, తాగడానికి నీరు లేదు. దీంతో అవి నరక యాతన చూస్తున్నాయి. 

ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫ‌రాఖాన్‌ ప‌న్నెండేళ్ల కూతురు అన్యా వీధుల్లోని జంతువులు, మూగజీవాల కోసం ఆలోచన చేసింది. చాలా జంతువులు ఆహారం, నీరు దొరక్క బాగా ఇబ్బంది పడుతున్నాయని గ్రహించిన అన్యా.. వాటి కోసం ఓ పని చేసింది. వెంటనే మూగ జీవాల చిత్రాలను గీసింది. వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రాన్ని రూ.1000 చొప్పున అమ్మింది. అలా ఇప్ప‌టివ‌ర‌కు రూ.70 వేల వ‌ర‌కు విరాళాల‌ను సేక‌రించింది.

ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్ ట్విట్టర్ లో స్వ‌యంగా వెల్ల‌డించింది. త‌న కూతురు అన్య డ్రాయింగ్ ద్వారా 5 రోజుల్లో రూ.70 వేలు సేక‌రించింద‌ని, ఆ మొత్తాన్ని వీధి జంతువుల‌కు ఆహారం అందించేందుకు వినియోగించ‌నున్నట్లు తెలిపింది. పెంపుడు జంతువుల చిత్రాల‌ను గీయ‌మ‌ని ఆర్డ‌ర్లు ఇచ్చిన‌ వారితో పా‌టు, విరాళాలు ఇచ్చిన‌వారికి ఆమె క‌త‌జ్ఞ‌త‌లు తెలిపింది. అన్య పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్న పాప అయినా పెద్ద మనసుతో ఆలోచన చేసిందని కితాబిస్తున్నారు.

Also Read |  యాపిల్ ను గట్టిగా కొరికిన కరోనా : న్యూయార్క్ లో కోవిడ్-19 విలయతాండవానికి కారణం ఇదే