డేంజర్ బెల్స్, దేశంలోని 30శాతం జిల్లాలకు వ్యాపించిన కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వానికి మరింత సవాల్ గా మారింది. దేశవ్యాప్తంగా 720 జిల్లాలు ఉంటే, 211 జిల్లాల్లో కరోనా బాధితులు ఉన్నారు. 211 జిల్లాల్లో కొన్ని చోట్ల 60శాతం మంది కరోనా బారిన పడ్డారు. మరికొన్ని చోట్ల 30శాతం మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య తెలిపింది.
రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే పరిణామం అంటున్నారు నిపుణులు. జిల్లాల్లో టెస్టింగ్ కిట్స్ కొరత, వైద్య సదుపాలు లేకపోవడం, ఇతర సమస్యల వల్ల కరోనాను కట్టడి చేయడం కష్టం అవుతుందన్నారు. లాక్ డౌన్ అమలు చేయడం కొంతవరకు ఫలితాన్ని ఇచ్చినా, ప్రజల కదలిక ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. భార దేశంలో ఏప్రిల్ నెలాఖరుకి 16వేల రెస్పిరేటరీ పంప్స్, 50వేల వెంటిలేటర్లు కరోనా పేషెంట్లకు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో 6వేల వెంటిలేటర్లు, 2వేల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 20 లేదా అంతకన్నా ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాలు మన దేశంలో 17 ఉన్నాయి. ఇందులో 11 జిల్లాల్లో 20శాతం కరోనా కేసులు ఉన్నాయి.
తమిళనాడులో మొత్తం జిల్లాల సంఖ్య 37, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 23.. కోవిడ్ శాతం 62
మహారాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 36, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 19, కోవిడ్ శాతం 52
కర్నాటకలో మొత్తం జిల్లాల సంఖ్య 30, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 14, కోవిడ్ శాతం 47
జమ్మూకశ్మీర్ లో మొత్తం జిల్లాల సంఖ్య 20, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 9, కోవిడ్ శాతం 45
వెస్ట్ బెంగాల్ లో మొత్తం జిల్లాల సంఖ్య 23, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 9, కోవిడ్ శాతం 39
తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 12, కోవిడ్ శాతం 36
రాజస్తాన్ లో మొత్తం జిల్లాల సంఖ్య 33, కరోనా బారినపడ్డ జిల్లాల సంఖ్య 11, కోవిడ్ శాతం 33
కేరళలో మొత్తం జిల్లాల సంఖ్య 14, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 14, కోవిడ్ శాతం 100
ఢిల్లీలో మొత్తం జిల్లాల సంఖ్య 11, కరోనా బారిన పడ్డ జిల్లాల సంఖ్య 11, కోవిడ్ శాతం 100
దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 720, కరోనా బారినపడ్డ జిల్లాల సంఖ్య 211, కరోనా శాతం 29.3