Coronavirus : ఇండియాలో కరోనా, కొత్తగా ఎన్ని కేసులంటే

గడిచిన 24 గంటల్లో దేశంలో 46 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

Coronavirus : ఇండియాలో కరోనా, కొత్తగా ఎన్ని కేసులంటే

India Corona

Updated On : August 26, 2021 / 11:28 AM IST

Coronavirus India : భారతదేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో..మరలా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం అందర్నీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 46 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారిన పడి కన్నుమూశారని తెలిపింది. కొత్తగా 34 వేల 159 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడి ఆరోగ్యవంతులయ్యారని, మొత్తంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530కి చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు.

Read More : సముద్రం ముందుకు, వెనక్కి.. దేనికి సంకేతం..?

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,33,725గా ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 1.03 శాతమని, రికవరీ రేటు 97.63 శాతంగా ఉందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అధికంగా కేరళలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే అక్కడ 31 వేల 445 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 215 మంది చనిపోయారు.

Read More : Gautam Adani: ప్రపంచంలోని టాప్-20 ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ

మరోవైపు…భారత్‌ మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది.. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.. ఇప్పుడు 60 కోట్ల డోస్‌ల మార్క్‌ను దాటింది.. మరికొద్ది రోజుల్లోనే దేశంలోని సగం మంది పెద్దలకు వ్యాక్సినేషన్‌ పూర్తి కానుంది.. నిన్న సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 46 కోట్ల 57 లక్షల మందికి 60 కోట్ల 2 లక్షల డోస్‌లను అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. ఇందులో 32 కోట్ల 90 లక్షల మందికి మొదటి డోస్‌ పూర్తి కాగా.. 12 కోట్ల 67 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తయ్యాయి.. జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 94 కోట్ల మంది 18 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.. ఈ లెక్కల ప్రకారం 49.5 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తైంది..