లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం.. పెళ్లిలో ఏడుగురే!

పెళ్లంటే ఓ సందడి.. సకుటుంబ సపరివార సమేతంగా.. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, ఆ తంతే గొప్పగా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశమంతా కూడా కరోనా దెబ్బకు పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే కొందరు కరోనా సమయంలో కూడా వారి కార్యక్రమాలు ఆపుకోట్లేదు.
లేటెస్ట్‌గా కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని హుక్కెరి తాలూకాలోని అత్తిహాళ హైస్కూల్ హెచ్‌ఎం పీ.డీ.పాటిల్ తన కుమార్తె అనూషా నిశ్చితార్థాన్ని మొబైల్‌ఫోన్ వీడియో కాల్ ద్వారా నిర్వహించారు. సంకేశ్వరలో అనూషా ఉండగా, బాగల్‌కోటలో కాబోయే భర్త మహంతేశ ఉంటారు. ఇద్దరి కుటుంబాలు నిశ్చితార్ధం ఆన్లైన్‌లోనే నిర్వహించుకున్నాయి.
విశాఖలో అయితే ఓ జంట అతి తక్కువ మంది ఆహ్వనితులుగా వివాహ తంతును ముగించుకున్నాయి. గవరపాలెంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు ఏడుగురితో పెళ్లి జరిగిపోయింది. (సరిలేరు మీకెవ్వరూ : ఇళ్లల్లో ప్రజలు..కుటుంబాలకు దూరంగా పోలీసులు)