జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

  • Published By: vamsi ,Published On : March 18, 2020 / 11:48 PM IST
జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

Updated On : March 18, 2020 / 11:48 PM IST

నెల కిందట చైనాలో బయటపడి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ దాదాపు ప్రతి దేశానికి వ్యాపించిన పరిస్థితి. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమందిని బలితీసుకుంటుందో నిపుణులు కూడా ఓ అంచనా వెయ్యలేకపోతున్నారు. ఇప్పటికే దీనిని మహమ్మారిగా ప్రకటించారు. మహమ్మారి అంటే..ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ముప్పుగా పరిణమించే అంటు రోగాల తీవ్రతను చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు.

ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా భావించినా దానికంటే ఇది ప్రమాదం ఎక్కువ కావడంతో అందరూ భయపడుతున్నారు. భారత్ కూడా ఇప్పటికే ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. వ్యాధిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది. దేశవ్యాప్తంగా కరోనాని వెంటనే కనుగొనేందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంతి కేంద్రం. కరోనా కిట్లను లక్ష వరకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం(17 మార్చి 2020) ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు హోం, విదేశాంగశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారితో మాట్లాడారు.

ఈ క్రమంలోనే జాతిని ఉద్ధేశించి ప్రధాని మోడీ ఇవాళ(12 మార్చి 2020) కీలక ప్రసంగం చెయ్యనున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, సాయుధ, పారామిలటరీ బలగాలు, విమానయాన సిబ్బంది, మున్సిపల్ స్టాఫ్ చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని రాత్రికి కీలక ప్రసంగంలో ఏం చెబుతారని ప్రతిఒక్కరికీ ఆసక్తిగా ఉంది. (నేటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు)