P Chidambaram: ఏడేళ్లకు తప్పు దిద్దుకున్నారు.. 2,000 నోట్ల ఉపసంహరణపై చిద్దూ చురక

ఆదివారం తమిళనాడులోని కారైకుడిలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద పొరపాటని అన్నారు

P Chidambaram: ఏడేళ్లకు తప్పు దిద్దుకున్నారు.. 2,000 నోట్ల ఉపసంహరణపై చిద్దూ చురక

Updated On : May 21, 2023 / 9:16 PM IST

2000 Note: 2,000 రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం చురకలంటించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషం కలిగించిందని, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడేళ్లు సమయం పట్టిందని ఆయన అన్నారు.

Asifabad: కుక్క కరిచిన గేదె పాలు తాగిన రెండు నెలలు.. ఇప్పుడు ఆసుపత్రికి పరుగులు తీస్తున్న వందల మంది

ఆదివారం తమిళనాడులోని కారైకుడిలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద పొరపాటని అన్నారు. దేశ ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని ఇష్టపడలేదని అన్నారు. రద్దయిన నోట్ల స్థానంలోనే 2,000 రూపాయలు నోటు తీసుకురావడాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు.