Bihar Diaries: అవినీతి కేసులో ఇరుక్కున్న నెట్‭ఫ్లిక్స్‭ సిరీస్ ‘ఖాకీ’కి ఇన్పిరేషన్ ఇచ్చిన పోలీసు అధికారి

వెబ్ సిరీస్ కోసం లోధా అవినీతి డబ్బును వాడినట్లు ఎఫ్ఐఆర్‭లో పేర్కొన్నారు. తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్‌ ఒక కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నారట. ఆయన సతీమణి బ్యాంకు ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ అయినట్టు బిహార్ పోలీసులు గుర్తించారు. సిరీస్‌ ఒప్పందానికి ముందే ఖాతాలో నగదు జమైందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు

Bihar Diaries: అవినీతి కేసులో ఇరుక్కున్న నెట్‭ఫ్లిక్స్‭ సిరీస్ ‘ఖాకీ’కి ఇన్పిరేషన్ ఇచ్చిన పోలీసు అధికారి

Corruption case against IPS Amit Lodha who inspired Netflix show 'Khakee'

Updated On : December 9, 2022 / 8:12 AM IST

Bihar Diaries: ఈమధ్యే నెట్‭ఫ్లిక్స్‭‭లో విడుదలైన ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ తెలిసే ఉంటుంది. బిహార్‭కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ లోధా నిజ జీవితంలో సంఘటనలతో తీసిన సిరీస్ అది. తన జీవితంలోని ఓ కీలకఘట్టాన్ని స్పృశిస్తూ ఆయనే స్వయంగా రాసిన ‘బిహార్‌ డైరీస్‌’ పుస్తకాధారంగా ఈ సిరీస్‌ రూపొందింది. కాగా, తాజాగా ఈయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు 120 (బి), 168 (ప్రజా సేవలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధంగా వ్యాపారం చేయడం) కింద లోధాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Mother Son Escape : జస్ట్ మిస్.. రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న తల్లీకొడుకులు, వీడియో వైరల్

వెబ్ సిరీస్ కోసం లోధా అవినీతి డబ్బును వాడినట్లు ఎఫ్ఐఆర్‭లో పేర్కొన్నారు. తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్‌ ఒక కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నారట. ఆయన సతీమణి బ్యాంకు ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ అయినట్టు బిహార్ పోలీసులు గుర్తించారు. సిరీస్‌ ఒప్పందానికి ముందే ఖాతాలో నగదు జమైందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. మగధ్‌ రేంజ్‌కు అమిత్‌ ఐజీగా ఉన్న సమయంలోనే ఇది జరిగిందని తెలిపారు. గయలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైనప్పటి నుంచి లోధా అక్రమంగా సంపాదిస్తున్నారని, ఆయన పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతి ఉండదని అమిత్‌పై ఫిర్యాదు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఓ డీఎస్పీని నియమించారు.

బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో భీభత్సం సృష్టించిన ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను ఒక పోలీసు అధికారి ఎలా పట్టుకోగలిగాడు అనే కథాంశమే ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్. బిహార్‌లోనే మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా మారిన ఆ గ్యాంగ్‌స్టర్‌.. ఒకే రోజు 24 హత్యలకు కారణమయ్యాడు. ఇక ఈ సిరీస్ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు