Bihar Assembly Election: ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?

బిహార్‌లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.

Bihar Assembly Election: ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?

PM Modi-CM Nithish

Updated On : November 14, 2025 / 4:17 PM IST

Bihar Assembly Election: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ దుందుభి మోగించింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ విడుదల చేసిన 69 పేజీల మ్యానిపెష్టోలో 25 హామీలను ఇచ్చింది. వాటిలో కోటి ఉద్యోగాలు, కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడం, ఉన్నత విద్య చదివే ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.2,000 సాయం, నాలుగు పట్టణాల్లో కొత్త మెట్రో రైలు ప్రాజెక్టులు, నాలుగు కొత్త అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి.

మరో ముఖ్య హామీ మహిళా ఉపాధి పథకం. దీని కింద మహిళలకు ఆర్థిక సాయం, పంటలన్నింటికీ కనీస మద్దతు ధర హామీ, 125 యూనిట్లు ఉచిత విద్యుత్‌, రూ.5,00,000 వరకు ఉచిత వైద్యం, 50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, రాష్ట్ర పారిశ్రామికీకరణకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 3,600 కి.మీ రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ, ఉచిత బియ్యం, సామాజిక భద్రత పెన్షన్ పెంపు కూడా ఉన్నాయి.

బిహార్‌ బడ్జెట్‌ రూ.2,56,333 కోట్లు (2024-2025 ప్రకారం). మహాఘట్‌బంధన్‌ కూడా బిహార్ ఎన్నికల ప్రచారం వేళ పెద్ద ఎత్తున ఉచిత పథకాలను ప్రకటించింది. మాహాఘట్‌బంధన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్రంపై ఏడాదికి రూ.16,19,000 కోట్ల వరకు భారం పడుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీఏ కూడా అదే స్థాయిలో హామీలను ఇచ్చింది.

బిహార్‌లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి వార్షిక ఖర్చు (ఒక్కరికి రూ.3,60,000 చొప్పున) రూ.9,93,600 కోట్లు అవుతుంది.

రాష్ట్రంలో మహిళలు 4.98 కోట్ల మంది ఉన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 (ఏడాదికి రూ.30,000) ఇవ్వడానికి వార్షిక ఖర్చు రూ.1,49,400 కోట్లు అవుతుంది.

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కి వార్షిక ఖర్చు (2.76 కోట్ల కుటుంబాలకు) రూ.33,000 కోట్లు అవుతుంది.

స్వయంసహాయక బృందాలకు అనుబంధంగా ఉన్న గ్రామీణ మహిళలు 1.23 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి వార్షికంగా రూ.3,60,000 ఇవ్వడానికి ఖర్చు మొత్తం కలిపి రూ.4,43,000 కోట్లు అవుతుంది.

కేవలం నాలుగు ప్రధాన హామీల ఖర్చు బిహార్ బడ్జెట్ కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ. బిహార్ మూలధన ఖర్చు రూ.64,895 కోట్లు, హామీల ఖర్చు దీనికంటే 25 రెట్లు ఎక్కువ. ప్రస్తుత ద్రవ్యలోటు రూ.32,718 కోట్లు. పైన పేర్కొన్న వివరాలు అన్నీ విశ్లేషకుల అంచనాలు మాత్రమే.