Vaccination for Beggers: వీధుల్లో బిచ్చగాళ్లకు వ్యాక్సిన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.

Vaccination for Beggers: వీధుల్లో బిచ్చగాళ్లకు వ్యాక్సిన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

SC seeks response from Centre and Delhi govt

Updated On : July 27, 2021 / 2:57 PM IST

SC Seeks Response from Centre: కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. కరోనా మహమ్మారి మూడో రాకముందే బిచ్చగాళ్లకు వ్యాక్సినేషన్ చేయించాలని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుష్ కర్లా అనే వ్యక్తి. కుష్ కర్లా తరపున మోహిత్ పాల్ అనే లాయర్ ఈ పిటీషన్ వేశారు.

మూడో వేవ్ వస్తే కోవిడ్-19 మహమ్మారి తీవ్రం అయ్యే పరిస్థితి ఉండగా.. బిచ్చగాళ్ళు, వీధివాసులకు పునరావాసం కల్పించాలని, వ్యాక్సిన్‌లను వేయాలని పిటిషన్‌‌లో కోరారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వంకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సహాయం చేయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరిన అత్యున్నత న్యాయస్థానం, ఇది ఒక సామాజిక-ఆర్థిక సమస్య కనుక ఏ బిచ్చగాడిని వీధుల్లోకి అనుమతించకూడదనే అభిప్రాయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు.

జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విద్య మరియు ఉపాధి లేకపోవడం వల్ల, ప్రజలు సాధారణంగా కొంత ప్రాధమిక జీవనోపాధి కోసం వీధుల్లో అడుక్కునే పరిస్థితి వస్తుంది. “సుప్రీంకోర్టుగా, వీధుల్లో బిచ్చగాళ్ళు ఉండకూడదని భావించొచ్చు కానీ, ఉండకూడదు అని మాత్రం ఆదేశించలేము” అని ధర్మాసనం తెలిపింది. అయితే, బిచ్చగాళ్ళు మరియు వీధివాసుల పునరావాసం, వారికి వ్యాక్సిన్‌లు వేయడం గురించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, ఈ విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని నోటీసులు ఇచ్చింది.