Covid-19 subvariant JN.1 alert : కొవిడ్ జేఎన్1 సబ్‌వేరియంట్ వ్యాప్తి.. క్రిస్మస్, కొత్త సంవత్సరానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు

దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిచెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్మిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది....

Covid-19 subvariant JN.1 alert : కొవిడ్ జేఎన్1 సబ్‌వేరియంట్ వ్యాప్తి.. క్రిస్మస్, కొత్త సంవత్సరానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు

Covid-19 subvariant JN.1

Updated On : December 19, 2023 / 9:56 AM IST

Covid-19 subvariant JN.1 alert : దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిచెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది.  క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముఖ్యంగా 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు. కేరళ, గోవా రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కర్ణాటక రాష్ట్రంలోనూ జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ ముప్పు వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉందని వైద్యాధికారులు అంటున్నారు.

కొత్త సబ్ వేరియంట్ వచ్చే ప్రమాదం లేదు…

‘‘భారతదేశంలో చాలామందికి కొవిడ్ రెండు లేదా మూడుసార్లు వచ్చింది. 95 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందు వల్ల వారికి ఈ కొత్త కొవిడ్ వైరస్ వచ్చే ప్రమాదం లేదని ఎయిమ్స్ పల్మోనాలజీ విభాగం మాజీ అధిపతి, పీఎస్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నాని చప్పారు.

ALSO READ : Ram Temple : దలైలామా నుంచి అదానీ దాకా…రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం

వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తరచుగా చేతులు కడుక్కోవడం, పండుగ సీజన్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి సాధారణ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ‘‘ఎదైనా రద్దీగా ఉండే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే వృద్ధులు ఎన్95 మాస్క్ ధరించాలని, దీని వల్ల కాలుష్యం, కొవిడ్-19, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి మాస్కు కాపాడుతుంది’’ అని డాక్టర్ ఖిల్నాని చెప్పారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

ALSO READ : Earthquake : చైనాలో భారీ భూకంపం…86మంది మృతి

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ముఖ్యంగా ముఖం, నోటిని తాకడానికి ముందు సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.